Homeతెలంగాణభూ యాత్ర వర్సెస్ నీళ్ల యాత్ర...!

భూ యాత్ర వర్సెస్ నీళ్ల యాత్ర…!

  • కెసిఆర్ ఫ్యామిలీ అక్రమ ఆస్తులపై కాంగ్రెస్ బస్సు యాత్ర

  • ప్రజల్లోకి బలంగా వెళ్తుండడంతో డిఫెన్స్ లో గులాబీ పార్టీ

  • విరుగుడుగా జూరాల ప్రాజెక్టు ముట్టడి

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ సమరం హీటెక్కిస్తోంది. గత పదేళ్ల పాలనలో గులాబీ పార్టీ అగ్ర నేతలు వేలకోట్ల రూపాయల భూ దోపిడీకి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక బస్సు యాత్రలకు చేపడుతున్నారు. నేరుగా వారి ఫామ్ హౌస్ లు, వివాదాస్పదం మీడియా సాక్షిగా ప్రదర్శిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పోర్ట్ యాత్రలో ప్రజల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. గులాబీ పార్టీ డిఫెన్స్ లో పడుతోంది. అయితే దాని దృష్టి మళ్లించేందుకు గులాబీ దళం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సాగునీటి సెంటిమెంట్ వస్త్రాన్ని భుజానికి ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న యాత్రలకు చెక్ పెట్టేందుకు.. రైతు సమస్యల ముసుగులో కౌంటర్ యాత్రలు మొదలుపెట్టింది.

భారీ నిరసన ప్రదర్శన…

Also Read:సర్కారీ వైద్యం, విద్యపై ప్రజాప్రతినిధుల అలసత్వం: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తీవ్ర ఆరోపణలు

పాలమూరు పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద గులాబీ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఖరీఫ్ చివరి దశలో పంటలు ఎండిపోతున్నాయంటూ మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టు ముట్టడికి ప్రయత్నం చేశారు. కొందరు ఆందోళన కారులు దూసుకెళ్లి హెడ్ రెగ్యులేటర్ తాళాలు పగలగొట్టారు. ఎడమ కాలువ గేట్లు బలవంతంగా ఎత్తి నీటిని విడుదల చేయడం గందరగోళానికి దారి తీసింది. ప్రాజెక్టు భద్రతను సైతం ఖాతరు చేయకుండా గేట్లు బద్దలు కొట్టే స్థాయికి వ్యవహారం చేరడంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. గులాబీ పార్టీ ముఖ్య నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. నేతల గృహనిర్బంధం కూడా సాగింది.

పెద్ద హైడ్రామా…

Also Read:అమెరికా దాడి ముప్పు.. సాయుధ దళాలను తీవ్ర అప్రమత్తం చేస్తూ ఇరాన్ ‘కోడ్ 100’ నిర్ణయం

జూరాల ప్రాజెక్టు వద్ద అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుంది. ఆ విషయం గులాబీ పార్టీ నేతలకు తెలుసు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు నికరంగా తెలంగాణకే దక్కుతోంది. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా ఇరిగేషన్ ఇంజనీర్లు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తారు అన్న సంగతి దశాబ్దాల అనుభవం ఉన్న గులాబీ పార్టీ నేతలకు తెలియంది కాదు. కానీ కాంగ్రెస్ నేతలు చేపట్టిన భూ యాత్రలతో కేటీఆర్ ఫ్యామిలీ అవినీతిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో ఈ సాగునీటి సమరం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడంతోపాటు క్యాడర్ను నిస్తేజం నుంచి బయటపడేసేందుకు జూరాల వద్ద ఈ స్థాయి హైదరాబాద్ నడిపించారన్న విమర్శలు బలంగా వినిపించాయి. ప్రాజెక్టు భద్రతను గాలికి వదిలేసి గేట్లు ఎత్తడం బాధ్యత రాహిత్యమని అధికార కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.

 తేలిపోతున్న బిఆర్ఎస్…

Also Read:వైసీపీకి బిగ్ షాక్.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వరుపుల సుబ్బారావు

ఒకవైపు కాంగ్రెస్ పార్టీ.. కెసిఆర్ ఫ్యామిలీ బినామీ ఆస్తులు, ఫామ్ హౌస్ లు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను ఆధారాలుగా చూపిస్తూ రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కానీ గులాబీ పార్టీ మాత్రం నీటి సంక్షోభం, రైతుల ఆవేదన పేరుతో కౌంటర్ అటాక్ చేస్తోంది. కేవలం రాజకీయ లాభం కోసం ప్రాజెక్టుల వద్ద విధ్వంసకర రీతిలో వ్యవహరించడం, గేట్లు పగలగొట్టడం వంటి చర్యలు ప్రజల్లో సానుభూతి మాట అటు ఉంచితే.. తిరిగి విమర్శలమే మూటగట్టుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు