Homeక్రైమ్కత్తితో పొడిచి యువకుడి హత్య.. పరారీలో నిందితుడు

కత్తితో పొడిచి యువకుడి హత్య.. పరారీలో నిందితుడు

క్రైమ్ మిర్రర్  : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం లాంటి హత్య ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన ఉన్న పరిశ్రమ సమీపంలో ఓ యువకుడు దారుణంగా హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ అనే యువకుడు ఇక్కడ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సాయిబాబా నగర్ కాలనీ–మద్దికుంట ప్రాంతంలోని ఎంఆర్‌ఎఫ్ (MRF) ఫ్యాక్టరీ సమీపంలో రాహుల్‌కు, మరో కూలీ నీరజ్‌కు మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. మాటమాట పెరిగి ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.

ఆవేశంతో ఊగిపోయిన నీరజ్, తన వద్ద ఉన్న కత్తితో రాహుల్‌పై తీవ్రంగా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన రాహుల్ తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రాహుల్ మృతి చెందాడని గ్రహించిన నిందితుడు నీరజ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సదాశివపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు గొడవకు కారణమేమిటి? వ్యక్తిగత కక్షలా లేక అప్పటికప్పుడు జరిగిన గొడవా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు నీరజ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
also read : బిట్రగుంటలో అక్రమ మద్యం విక్రయాలు.. 30 బాటిళ్లు స్వాధీనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు