Homeక్రైమ్స్కూల్‌మెట్ల‌పై నుంచి ప‌డి విద్యార్థిని మృతి...! షాద్‌న‌గ‌ర్‌లో విషాదం...

స్కూల్‌మెట్ల‌పై నుంచి ప‌డి విద్యార్థిని మృతి…! షాద్‌న‌గ‌ర్‌లో విషాదం…

షాద్‌నగర్, క్రైమ్ మిర్రర్: స్కూలు మెట్ల‌పై నుంచి కింప‌ద‌డి మృతి చెందిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా విషాదం చోటు చేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం వర్ణిక షాద్‌నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలో మెట్లు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి త‌ర‌లించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం వర్ణిక మృతి చెందింది. చిన్నారి కుటుంబీకుల రోదులు ప‌లువురిని కంట‌త‌డిపెట్టించాయి.

సీసీ కెమెరాల్లో రికార్డు…

Also Read:తీవ్ర విషాదం…! గ‌ణేష్ నిమ‌జ్జ‌నం నుంచి తిరిగి వ‌స్తుండ‌గా ఘోర రోడ్డు ప్ర‌మాదం…! స్పాట్‌లోనే న‌లుగురు..

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు పాఠశాలలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు తెలిపారు. ఫుటేజీలో వర్ణిక మెట్లు దిగుతూ ఒక్కసారిగా కిందపడినట్లు కనిపించినట్లు షాద్‌నగర్ సీఐ కే. సీతారాం తెలిపారు. కాగా ప్రమాదం ఎలా జరిగింది? బాలిక కిందపడిన వెంటనే పాఠశాల సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తదితర అంశాలపై పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మ‌రోవైపు విద్యార్థిని కుటుంబ స‌భ్యులు పాఠ‌శాల యాజ‌మాన్యం ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఎందుకు తెలుప‌లేద‌ని ఆరోపించారు.

Also Read: ముషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం…! ద‌గ్ధ‌మైన డీజే ప‌రిక‌రాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు