Homeతెలంగాణఖైరతాబాద్ లో గెలిచేదెవరు?

ఖైరతాబాద్ లో గెలిచేదెవరు?

-దానం నాగేందర్ పై అనర్హత వేటు
-అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లినా ఛాన్స్ లేదంటున్న నిపుణులు
-బై పోల్ కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ కు సవాల్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

తెలంగాణలో మరో ఎన్నిక అనివార్యం అయ్యేలా ఉంది. దానం నాగేందర్ పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా లేదు. తెలంగాణ హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కానీ.. ఈ అనర్హత వేటులకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఫిరాయింపుల కేసులకు సంబంధించి సంచలన తీర్పులు ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో దానం నాగేందర్ కు సైతం సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కచ్చితంగా ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది. అయితే ఈ ఎన్నిక భారత రాష్ట్ర సమితికి కొత్త ఊపిరి పోస్తుందా? కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెస్తుందా? భారతీయ జనతా పార్టీకి కొత్త అవకాశం దక్కుతుందా? అన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

గులాబీ పార్టీకి ఛాన్స్..
గులాబీ పార్టీకి ఇదో అరుదైన అవకాశం. పార్టీ పుంజుకుంటుందని నాయకత్వం చెబుతోంది. అందుకే అధికార కాంగ్రెస్పై పోరాడేందుకు ఇదో సువర్ణ అవకాశం. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం గులాబీ పార్టీకి పెను సవాల్ విసురుతోంది. గతంలో పక్కనే ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్, సానుభూతి ఏమాత్రం పనిచేయలేదు. హైదరాబాద్ మహానగర పరిధిలో గ్రామీణ ప్రాంతాల తరహా సాంప్రదాయ రాజకీయాలు, సానుభూతి పవనాలు పనిచేయవు అన్న విషయం ఆ ఎన్నికతో తేలిపోయింది. వాస్తవానికి ఖైరతాబాద్ లో గులాబీ పార్టీ కంటే దానం నాగేందర్ బలం అధికం అన్నది విశ్లేషకుల మాట. అందుకే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నది ఒక అభిప్రాయం.

సంస్థాగత బలం తక్కువ..
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి సంస్థాగత బలం తక్కువ. గత దశాబ్ద కాలంగా అక్కడ రాజకీయం మొత్తం దానం నాగేందర్ చుట్టూనే తిరిగింది. అక్కడ పార్టీ కంటూ ప్రత్యేక క్యాడర్ నిర్మాణం జరగలేదు. దానం నాగేందర్ కు నియోజకవర్గంలో ఉన్న బలమైన వ్యక్తిగత అనుచర గణం, స్థానిక బస్తీల్లో ఆయనకు ఉన్న వ్యక్తిగత పట్టు కాదనలేని వాస్తవం. దీనికి తోడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ లో సంప్రదాయ బద్దంగా ఉన్న పాత ఓటు బ్యాంక్, సంస్థాగత క్యాడర్ తోడవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన లోకల్ క్యాడర్, సరైన అభ్యర్థి లేని బిఆర్ఎస్ కు.. దానం నాగేందర్ వ్యక్తిగత బలం, కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదుర్కోవడం భారత రాష్ట్ర సమితికి చాలా కష్టం. ఈ బై పోల్ లో గులాబీ పార్టీ మరోసారి ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి పూర్తి డ్యామేజ్ తప్పదు.

అప్పట్లో ఓటమి..
2004లో ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్ దక్కకపోయేసరికి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వెంటనే టిడిపి ఎమ్మెల్యే పదవి పోటీ చేసి కాంగ్రెస్ లో చేరారు. ఉప ఎన్నిక రాగా.. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ దానం నాగేందర్ తో అటువంటి ప్రయోగం చేసి విఫలం అయితే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. సుస్థిరతకు సైతం విఘాతం కలిగే ఛాన్స్ ఉంటుంది. తరువాత వచ్చే గ్రేటర్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది ఒక సవాల్. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు