Homeక్రైమ్నాగోల్‌లో దారుణ హత్య.. వైన్స్‌లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగులు

నాగోల్‌లో దారుణ హత్య.. వైన్స్‌లో వ్యక్తిని కత్తులతో నరికి చంపిన దుండగులు

క్రైమ్ మిర్రర్ : వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని నాగోల్‌ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. బండ్లగూడలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు బాధితుడిని వెంబడించడంతో అతడు బండ్లగూడలోని ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలోని సుప్రీమ్‌ వైన్స్‌లోకి వెళ్లాడు. అయినప్పటికీ దుండగులు అక్కడికి చేరుకుని అతడిపై మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నాగోల్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైన్స్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, నిందితులు కారులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు, దాడికి పాల్పడిన వారు ఎవరు, హత్యకు అసలు కారణం ఏమిటనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ హత్యతో బండ్లగూడ పరిసరాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరగా గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
also read: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్‌ లారీ.. 20 మందికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు