Homeతెలంగాణదేశంలో కుల వివక్ష తొలగలేదు...! మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

దేశంలో కుల వివక్ష తొలగలేదు…! మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

  •  పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను అవమానించిన బీజేపీ

 

మంచిర్యాల‌ప్ర‌తినిధిః, క్రైమ్‌మిర్ర‌ర్‌: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 76 సంవత్సరాలు కావస్తున్న కుల వివక్ష ఇంకా పోలేదని దీనికి నిదర్శనం తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జార్ఖండ్ లో ఆయ‌న వెళ్లిన‌ చోటును శుద్ధికరణ చేయడం దారుణమని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం ఆయన మందమ ర్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండి పడ్డారు. ప్రజల కోసమే పని చేస్తున్న పార్టీలు కులాల పేరిట, మతాల పేరిట విభజనరేఖ గీసి వివక్ష చూపడం ఏంటని అన్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడు అయినందునే ఈ దారుణం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై లేని పోని విషయాలపై గగ్గోలు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని మండి పడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు రెండేనని అందులో తేడా ఏమిలేదని విమర్శించారు.

Also Read:బాలాపూర్ గణనాథుడి శీఘ్రదర్శనానికి భారీ ఏర్పాట్లు…!

ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ ఏదైన ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆదరణ పొందే ప్రయత్నాలు చేస్తుందని అయినప్పటికీ ఆ పార్టీని ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు.ఆ పార్టీ వ్యవస్థాక అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పి దళిత బందు అని, ఈ హామీలు అమలయ్యాయా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పదేళ్లపాలనలో ధరణి పేరుతో దర్జాగా భూములు లాక్కున్నారని 22ఏ పై గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి పూర్తి సమగ్ర వివరణ ఇవ్వడం జరిగిందని 55నాటి చట్టం ప్రకారం ఎవరికి భూములు కూడ ఇబ్బంది కలుగదని వివరణ ఇచ్చారన్నారు.

Also Read:ఏఐ టెక్నాలజీ పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలి.. లేదంటే వ్యర్థం: సత్య నాదెళ్ల

అయినప్పటికీ 22ఏ పేరుతో ప్రభుత్వం భూములు కాజేసే ప్రక్రియ చేపట్టిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఓ వైపు ప్రజా సమస్యలపై అసెంబ్లీ జరుగుతుంటే మాక్ అసెంబ్లీ పేరుతో ప్రజా సమస్యలను పక్కన పెట్టి పరిహాసం చేస్తూ పగలబడి నవ్వుకున్నారని ఇంతకంటే దారుణం మరోకటి ఉం డదన్నారు. ఇప్పటికైన బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అదోగతి చేశార‌న్నారు. ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పాలని అన్నారు. రాష్ర్టంలో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ వారు మాత్రమే ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవం త్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో ప్రజల విశ్వనీయతను చూరగొం దని వాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, మంద తిరుముల్ రెడ్డి, ఎండీ ఇసాక్, జావీద్, పవన్, రమేశ్, సంగి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు