ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో ఓ యువకుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన అతడిని ఆమె కుటుంబసభ్యులు పట్టుకుని తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. తాళ్లతో బంధించి తలకిందులుగా వేలాడదీసి, ఆ తర్వాత ఓ స్తంభానికి కట్టేసి అరగంటకుపైగా దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సెప్టెంబర్ 9న మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. యువకుడిని తమ అదుపులోకి తీసుకున్న కుటుంబసభ్యులు అతడిపై దాడి చేయడంతో పాటు విడుదల చేయాలంటే రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. యువకుడిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
also read: ఆదిలాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం.. 16 మంది నుంచి రూ.13.50 కోట్లు వసూలు
