Homeక్రైమ్దారుణ హత్య.. ఎఫైర్ అనుమానంతో యువకుడిని 17 సార్లు కత్తితో పొడిచి..

దారుణ హత్య.. ఎఫైర్ అనుమానంతో యువకుడిని 17 సార్లు కత్తితో పొడిచి..

తూర్పు ఢిల్లీలో అనుమానం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మండావలికి చెందిన 22 ఏళ్ల కేశవ్ కుమార్.. తన అన్న భార్యతో 22 ఏళ్ల వంశ్ దేధాకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ కారణంగా వంశ్‌పై కక్ష పెంచుకున్న కేశవ్.. మరో వ్యక్తి సహాయంతో అతడిపై దాడికి పాల్పడ్డాడు.

వంశ్‌పై కత్తితో ఏకంగా 17 సార్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబానికి వంశ్ ఒక్కరే ఆధారమని తెలుస్తోంది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు కేశవ్ కుమార్‌ను అరెస్టు చేసి, అతడు ఉపయోగించిన కత్తితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మరో వ్యక్తి కూడా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రస్తుతం అతడి కోసం గాలిస్తున్నారు.

also read: పెనుబల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు