Homeక్రైమ్నగరంలో గంజాయి ముఠా అరెస్ట్.. 21 కిలోల సరుకు స్వాధీనం

నగరంలో గంజాయి ముఠా అరెస్ట్.. 21 కిలోల సరుకు స్వాధీనం

క్రైమ్ మిర్రర్ : నగరంలో అక్రమంగా ఎండు గంజాయి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హబీబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 21 కిలోల గంజాయితో పాటు రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ కె.శ్రీనివాస్ తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సందీప్ నంద కిషోర్, రాహుల్ రాజేశ్ పాటిల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నగరంలోని మంగల్‌బస్తీ ప్రాంతానికి చెందిన కాంబ్లె ఉమేశ్, కాంబ్లె సూరజ్‌కు ఈ సరుకును అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గంజాయి విక్రయాలపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో హబీబ్‌నగర్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి విక్రయించేందుకు నిందితులు వచ్చిన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం వారి వద్ద తనిఖీలు నిర్వహించగా భారీగా ఎండు గంజాయి, నగదు లభించినట్లు వెల్లడించారు.
also read : ప్రియుడి కోసం కన్నతల్లినే హత్య చేసిన కూతురు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు