Homeసినిమావిజయ్ దేవరకొండ చేతికి సీడ్ గణేశ్.. వినాయక చవితికి హీరో పిలుపు ఇదే!

విజయ్ దేవరకొండ చేతికి సీడ్ గణేశ్.. వినాయక చవితికి హీరో పిలుపు ఇదే!

ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు తన మద్దతు ప్రకటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం ఆయనకు ‘సీడ్ గణేశ్’ ప్రతిమను అందజేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

పండుగ సమయంలో పర్యావరణానికి హాని కలిగించని విధంగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలని ఆయన సూచించారు. అలాగే విత్తనాలతో రూపొందించిన గణపతి ప్రతిమలను ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని తెలిపారు. వినాయక చవితి పూర్తైన తర్వాత సీడ్ గణేశ్ ప్రతిమను నాటితే అందులోని విత్తనాల నుంచి మొక్కను పెంచుకోవచ్చని వివరించారు.

భక్తి, సంప్రదాయాలను పాటిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని తగ్గించే పండుగలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన పర్యావరణహిత కార్యక్రమానికి విజయ్ దేవరకొండ తన మద్దతు తెలిపారు.

ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలు, సీడ్ గణేశ్‌లను వినియోగించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.

also read: కృష్ణా జిల్లాలో విషాదం.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు