క్రైమ్ మిర్రర్ : భద్రాచలం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలకు సంబంధించి పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ఇటీవల భద్రాచలం పట్టణంలో బైక్ చోరీలు పెరగడంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భద్రాచలం టౌన్ ఎస్ఐ బి. రామకృష్ణ సిబ్బందితో కలిసి కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న గుగులోత్ శ్రీనును పోలీసులు ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు.
అయితే శ్రీను సరైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో గత కొంతకాలంగా భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి సమాచారం ఆధారంగా నాలుగు చోరీకి గురైన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీనును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలోనూ పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
also read : పాము కాటుకు 12 ఏళ్ల బాలుడు మృతి..
