Homeతెలంగాణబీజేపీలోకి నో ఛాన్స్!

బీజేపీలోకి నో ఛాన్స్!

– కొండా దంపతులను చెత్త తో పోల్చిన సీనియర్ నేత మురళీధర్ రావు
– తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉమ్మడి వరంగల్ భారతీయ జనతా పార్టీ నేతలు
– కమలం పార్టీలో చేరిన గౌరవం దక్కేలా లేదు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

కొండా దంపతులు అనుకున్నంత పని అయ్యింది. వారిని భరించేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి.. దీనికి గత అనుభవాలు, ప్రస్తుతం జరిగిన పరిణామాలే కారణం. ఆ దంపతులు ముందుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆ పార్టీ ముఖ్యమంత్రిని విభేదించి మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అక్కడ అధినేత జగన్మోహన్ రెడ్డిని విభేదించి గులాబీ పార్టీలోకి వచ్చారు. ఇక్కడ కెసిఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించి రేవంత్ పంచన చేరారు. ఆయనను వ్యతిరేకించి మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. మీసం మేలేసి కొండా మురళి అయితే తమకు చాలా భవిష్యత్తు ఉందంటూ సంకేతాలు ఇచ్చారు. కానీ గులాబీ పార్టీ వద్దు బాబోయ్ అంటూ డోర్స్ క్లోజ్ చేసింది. ఇప్పుడు బిజెపి సైతం అలానే సంకేతాలు ఇచ్చింది. కచ్చితంగా ఇది ఆ దంపతులకు ఇబ్బందికర పరిస్థితి.

ఆదిలోనే అవమానం
ప్రస్తుతం కొండా దంపతులు పనిచేయలేని పార్టీ అంటూ ఉందంటే అది బిజెపి. అందుకే వారు బిజెపిలోకి వెళ్తారని ప్రచారం నడిచింది. కానీ అక్కడ కూడా తీవ్ర అవమానకర రీతిలో తలుపులు మూసేసినట్లు ప్రచారం నడుస్తోంది. బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు ఇతర పార్టీల చెత్తను నింపడానికి బీజేపీ ఏమీ డస్ట్ బిన్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇవి తీవ్ర కలకలం రేపాయి. ఇంకా పార్టీలో చేరకముందే.. చేరికల వార్తలు వస్తున్న తరుణంలోనే ఒక సీనియర్ నేత స్థాయి వ్యక్తి నుంచి ఇంతటి ఘాటు వ్యాఖ్యలు రావడం కొండా దంపతుల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి.

అంతర్గత విభేదాలు..
కొండా దంపతుల వ్యవహారం ఇప్పుడు బీజేపీ నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి కొందరు నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి బలమైన సామాజిక వర్గ నేతలు అవసరం అని భావిస్తున్నారు. కొండా దంపతులను బిజెపిలోకి తేవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీలో సుదీర్ఘ కాలముగా ఉన్న మురళీధర్ రావు తో పాటు మెజారిటీ స్థానిక నేతలు ఈ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొండా దంపతుల వైఖరి, బిజెపి సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు సరిపడవని.. వారిని పార్టీలోకి తీసుకుంటే ఏళ్ల తరబడి కష్టపడిన స్థానిక నాయకులు అన్యాయం జరుగుతుందని ఎక్కువగా భావిస్తున్నారు.

పునరాలోచనలో..
బిజెపి నుంచి ఈ స్థాయి అవమానాలు ప్రారంభం నుంచే ఎదురు కావడంతో కొండా దంపతులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇలా చెత్త ముద్ర వేయించుకుని అవమాన పరిస్థితుల్లో చేరడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ధర్మపురి అరవింద్ వర్గం ఒత్తిడి తెచ్చి అధిష్టానం ద్వారా వారికి సభ్యత్వం ఇప్పిస్తే.. మురళీధర్ రావు లాంటి సీనియర్ నేత వ్యాఖ్యలతో వారికి లభించే గౌరవం ఇట్టే అర్థం అయిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా పనిచేశారు ఆ దంపతులు. అనవసరంగా పరకాల నియోజకవర్గ కోసం తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టారు. అందుకే ఏ పార్టీకి అక్కరకు రాకుండా పోయారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు