Homeక్రైమ్ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సూసైడ్ నోట్

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సూసైడ్ నోట్

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ.. జీవితంపై ఆశ కోల్పోయినట్లు మాధురి పేర్కొన్నట్లు సమాచారం. అలాగే.. తాను తప్పు చేశానని, అందుకు తన చావే శిక్ష అంటూ సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని మాధురి ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఈశ్వర్ సాయిని అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురైన మాధురి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం.

మాధురి ఉరేసుకున్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను కిందకు దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాధురి చేసిన ఆరోపణలు, సూసైడ్ నోట్‌లోని అంశాలపై విచారణ కొనసాగుతోంది.

also read: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం: పలు జిల్లాలకు ఐఎండీ వర్ష హెచ్చరిక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు