Homeలైఫ్ స్టైల్ఫ్యామిలీ అంతా ఒకే సబ్బు వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఫ్యామిలీ అంతా ఒకే సబ్బు వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బును వాడే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకే సబ్బును ఇంట్లోని వారందరూ ఉపయోగించడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు, ప్రత్యేకించి చర్మ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.సూక్ష్మజీవుల వ్యాప్తి:స్నానం చేసిన తర్వాత సబ్బు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇలాంటి తేమ ఉన్న వాతావరణంలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. ఆ సబ్బును కుటుంబంలోని మరొకరు వాడినప్పుడు, ఆ సూక్ష్మజీవులు సులభంగా వేరొకరి శరీరానికి వ్యాపిస్తాయి. దీనివల్ల గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తాయి.

జాగ్రత్తలు పాటించాలి:- ఇంట్లో ఎవరికైనా ఇప్పటికే చర్మ సమస్యలు ఉంటే, వారి ద్వారా మిగిలిన వారికి ఈ వ్యాధులు సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ వ్యక్తిగతంగా వేర్వేరు సబ్బులను ఉపయోగించాలని లేదా లిక్విడ్ బాడీ వాష్ వాడాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం…! ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు