-
రాజీనామా చేసే యోచనలో కెసిఆర్
-
పదే పదే రేవంత్ సవాల్ తో వ్యూహాత్మక ఎత్తుగడ
-
మళ్లీ పాత సెంటిమెంట్ తెరపైకి…
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గజ్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా? కెసిఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారా? తద్వారా బై పోల్ కు తెరతీయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉప ఎన్నికల రాజకీయాల్లో కెసిఆర్ సైని ప్రత్యేక. ఒక రాజీనామాకు సెంటిమెంటును రగిలించి.. దానికి ప్రజామోదం పొంది పార్టీ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తే వారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
అదే పనిగా సవాల్…
Also Read:రూ.30 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ కేసిఆర్ కు సవాల్ చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతున్నారని నిత్యం దాడి చేస్తున్నారు. అయితే దీనిని కేసీఆర్ ఒక అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే గులాబీ పార్టీకి ఇది ఒక ఆయాచిత లబ్ధి. రేవంత్ ఈ తరహా విమర్శలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినవని.. తరచూ తనను అవమానిస్తున్నారంటూ కేసిఆర్ నిజంగా గజ్వేల్ స్థానానికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో రాజకీయ సమరం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
ఉప ఎన్నిక రాజకీయంతోనే…
Also Read:విశాఖలో విషాదం.. నేవీ ఉద్యోగి భార్య మృతి
కెసిఆర్ తన పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉప ఎన్నికల రాజకీయ ఫైలిని అనుసరించారు. ఉన్న పదవులకు రాజీనామా చేయించి.. వాటికి సెంటిమెంటు తగిలించి.. చివరకు ప్రజామోదం పొంది పార్టీ ఇమేజ్ను పెంచుకునేవారు. అందుకే ఇప్పుడు రేవంత్ విసిరిన సవాల్ స్వీకరించి.. కెసిఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనకు వస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. తన రాజీనామా చేసి ఈ ప్రభుత్వ పాలనకు రెఫరండంగా తీసుకుంటే పూర్తిగా పరిస్థితి మారిపోనుంది. కాంగ్రెస్ నన్ను అవమానిస్తోంది. మళ్లీ నేను మీ తీర్పు కోరుతున్న అని కేసిఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే.. గులాబీ పార్టీ శ్రేణుల్లో మునుపటి ఉద్యమ స్ఫూర్తి రగిలే అవకాశం ఉంది.
ఆ ధైర్యం చేయగలరా…
Also Read:సీఎం పేరిట డీప్‌ఫేక్ కలకలం.. రంగంలోకి క్రైమ్ బ్రాంచ్
అయితే గులాబీ పార్టీ అంత ధైర్యం చేయగలదా అనేది ఇప్పుడు అనుమానం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ ఓడిపోయింది. ఒకవేళ కెసిఆర్ రాజీనామా చేసి బైపోల్ కు వెళ్లి.. పొరపాటున ఓడిపోతే అక్కడ పరిస్థితి ఏంటనేది ఆ పార్టీలో నెలకొన్న భయం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన యంత్రాంగాన్ని, సంక్షేమ హామీలను ఉపయోగించి గజ్వేల్ ను దక్కించుకోవడానికి ఎలాగూ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. కేవలం గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పడేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నారు. ఒకవేళ కెసిఆర్ బైపోల్ కు వెళ్లి గెలిచినా ఇప్పటికీ ఇప్పుడు రేవంత్ కు వచ్చే ఇబ్బంది లేదు. కెసిఆర్ ఓడిపోతే మాత్రం రేవంత్ తెలంగాణ సమాజంలో హీరో అవుతారు. సొంత పార్టీలోనూ స్ట్రాంగ్ అవుతారు.
