తమిళనాడు రాష్ట్రంలోని 52 ప్రముఖ ఆలయాల్లో కెమెరా మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణాల్లో కొందరు భక్తులు రీల్స్ చేయడం, అనవసరంగా ఫోటోలు, వీడియోలు తీస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించడాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ప్రశాంతతను పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఆలయాల్లోకి వెళ్లేముందు భక్తులు తమ వద్ద ఉన్న ఫోన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిపాజిట్ కేంద్రాలలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో ఫోన్‌కు రూ. 5 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు తమ ఫోన్లను తిరిగి పొందే వెసులుబాటు కల్పించారు.అయితే, ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత మరియు ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రసిద్ధ దేవాలయాలకు రోజువారీగా వేలాది మంది, శని-ఆదివారాల్లో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అంత భారీ సంఖ్యలో వచ్చే జనాభాకు తగినన్ని డిపాజిట్ కౌంటర్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫోన్లు డిపాజిట్ చేయడానికి, తిరిగి తీసుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు, దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు అత్యవసర సమయాల్లో సంప్రదింపులు జరపడం కష్టంగా మారుతోందని వాపోతున్నారు. ఆలయ పవిత్రతను కాపాడటం మంచిదే అయినప్పటికీ, భక్తులకు క్యూ లైన్లలో ఆలస్యం కాకుండా మౌలిక వసతులు మరియు డిపాజిట్ కౌంటర్ల సంఖ్యను తక్షణమే పెంచాలని తమిళనాడు ప్రభుత్వానికి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి మీ నాయకురాలికే లేదు, నీకుందా?’: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫై
వినాయక చవితికి తెలంగాణ పోలీసుల సైబర్ అలర్ట్.. గణేశుడి రూపంలో కీలక సందేశం!
