Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. రాజ్‌ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. రాజ్‌ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం రవాణా కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రాజ్‌ కేసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డిలకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

ఈ కేసు విచారణలో నిబంధనలను సక్రమంగా పాటించలేదంటూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి, డి. వాసుదేవరెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వారి స్పందనను కోరిన ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

దీంతో ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు మరోసారి న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

also read: 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లికి రెడీ.. వ్యక్తిగత జీవితంపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రేమ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు