చికెన్ ముక్కల విషయంలో మొదలైన చిన్నపాటి వివాదం చివరకు ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని బెలగావి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పార్టీలో చికెన్ తినే సమయంలో తలెత్తిన గొడవలో ఓ వ్యక్తి తన స్నేహితుడిపై కత్తితో దాడి చేయడంతో అతడు మృతి చెందాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సీతారామ్, అరుణ్ మరో నలుగురితో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఆదివారం వీరంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చికెన్ తింటుండగా సీతారామ్ ఎక్కువ ముక్కలు తీసుకుంటున్నాడంటూ అరుణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన అరుణ్ వంటకు ఉపయోగించే కత్తితో సీతారామ్ ఛాతిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సీతారామ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు అరుణ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. చిన్న విషయంగా మొదలైన వివాదం హత్యకు దారితీయడంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
also read: మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్.. 20లోకి అడుగుపెట్టిన గౌతమ్‌కు స్పెషల్ విషెస్!
