నోయిడా, క్రైమ్‌మిర్రర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నొయిడాలోని జేవార్ సమీపంలో యమునా రహదారిపైన ఓ ట్రక్కు అతివేగంగా ప్రయాణిస్తోంది. ఇంతలో అదుపుతప్పిన ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టి, అవతలి వైపు రోడ్డుమీదికి దూసుకెళ్లింది. అటువైపుగా వస్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది.
Also Read: ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ముల విషాదాంతం… అన్న మృతిని తట్టుకోలేక తమ్ముడు మృతి..
ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read:భార్య కాపురానికి రాలేదని దారుణం.. జైలు నుంచి వచ్చిన వ్యక్తి ఘాతుకం
