Homeక్రైమ్విషాదంగా మారిన పూజా కార్యక్రమం... కొత్త కారు ఢీకొని 70 ఏళ్ల వ్యక్తి మృతి

విషాదంగా మారిన పూజా కార్యక్రమం… కొత్త కారు ఢీకొని 70 ఏళ్ల వ్యక్తి మృతి

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన కారు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తుమ్ములపల్లి రామచంద్రరావు (70) తన మేనల్లుడు సాయికుమార్‌తో కలిసి కొత్త కారుకు పూజ చేయించడానికి పెద్దమ్మతల్లి ఆలయానికి వెళ్లారు.

పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కారును కొద్దిగా ముందుకు నడపాలని పూజారి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో కారు నడుపుతున్న సాయికుమార్‌ బ్రేక్‌కు బదులుగా అనుకోకుండా యాక్సిలరేటర్‌ తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది.

కారు ముందు ఉన్న రామచంద్రరావును ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం చికిత్స పొందుతూ రామచంద్రరావు మృతి చెందారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

also read: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ఒత్తిడి.. దారుణంగా హత్య చేసిన ప్రియుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు