HomeUncategorized150 లీటర్ల ఆవు కొవ్వు నూనె సీజ్

150 లీటర్ల ఆవు కొవ్వు నూనె సీజ్

క్రైమ్ మిర్రర్ : ఆవు కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు సుమారు 100 నుంచి 150 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటాపురం గ్రామంలోని ఓ మాంసం విక్రయ కేంద్రం నుంచి అపరిశుభ్రమైన నీరు రోడ్డుపైకి వస్తుండటంతో గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి స్రవంతికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె సర్పంచ్ కందుల బాలచందర్‌తో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆవు కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నట్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పంచాయతీ కార్యదర్శి ఆహార భద్రత శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆహార భద్రత అధికారి శరత్ సిబ్బందితో కలిసి వెంకటాపురంలోని సంబంధిత ఇంటిని తనిఖీ చేశారు. షేక్ సర్వర్ జానీ, అతని తమ్ముడు అన్వర్ జానీ కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి సుమారు 100 నుంచి 150 లీటర్ల నూనెను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముదిగొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ నూనెను కొనుగోలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి, దానిని ఎక్కడ, ఏ అవసరానికి వినియోగిస్తున్నారనే అంశంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
also read : హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్లపై ఉక్కుపాదం.. 11 మంది అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు