Homeక్రైమ్మరో ప్రాణం తీసిన చైనా మాంజా... బైక్‌పై వెళ్తుండగా విషాదం

మరో ప్రాణం తీసిన చైనా మాంజా… బైక్‌పై వెళ్తుండగా విషాదం

ఉత్తరప్రదేశ్‌లో చైనా మాంజా మరో ప్రాణాన్ని బలితీసుకుంది. గాజియాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

నోయిడాకు చెందిన రవి రాజ్‌ స్నేహితుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా.. యూపీ గేట్‌ సమీపంలో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా గాలిలో ఉన్న మాంజా ఆయన మెడకు చుట్టుకుంది. అత్యంత పదునుగా ఉండే మాంజా కారణంగా రవి రాజ్‌ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. గాయం తీవ్రతతో మెడ ఎముక వరకు దెబ్బతిన్నట్లు సమాచారం.

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రవి రాజ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

చైనా మాంజా వినియోగంపై ఇప్పటికే నిషేధాలు ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో దాని విక్రయాలు, వినియోగం కొనసాగుతుండటంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదకరమైన మాంజా విక్రయాలు, వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ప్రజలు నిషేధిత మాంజాను కొనుగోలు చేయడం, ఉపయోగించడం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించే సమయంలో ఇలాంటి మాంజా కారణంగా ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

also read: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. దర్యాప్తుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు