Homeతెలంగాణభారత్‌లో వయసు పెరగని హీరోలు ఇద్దరే.. సూర్య, మహేష్‌పై త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్...!

భారత్‌లో వయసు పెరగని హీరోలు ఇద్దరే.. సూర్య, మహేష్‌పై త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: తమిళ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ & సన్స్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సూర్యతో కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని త్రివిక్రమ్ తెలిపారు. అయితే ఇప్పటివరకు సూర్యకు నచ్చే కథను చెప్పలేకపోయానని, త్వరలోనే ఆయనతో కలిసి పనిచేస్తాననే నమ్మకం ఉందని చెప్పారు. అంతేకాదు, తన భార్య సూర్యకు పెద్ద అభిమాని అని, ఆయనతో సినిమా చేయాలని తనను డిమాండ్ చేస్తుంటారని సరదాగా వెల్లడించారు.

Also Read:మహారాష్ట్రలో విద్యార్థుల ఫ్రీస్టైల్ ఫైట్.. వైరల్‌గా మారిన వీడియో

సూర్య గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. తనకు తెలిసి ఇండియాలో వయసు పెరగకుండా మరింత యంగ్‌గా కనిపించే హీరోలు ఇద్దరేనని అన్నారు. వారిలో ఒకరు సూర్య కాగా, మరొకరు మహేష్ బాబు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సూర్య నటించిన గజినీ చిత్రాన్ని కూడా త్రివిక్రమ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందులో సంజయ్ రామస్వామి పాత్ర తమిళంతో పాటు తలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైందని అన్నారు. కొన్ని పాత్రలు దశాబ్దాల పాటు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయని, గజినీ లో సూర్య పోషించిన పాత్ర అలాంటిదేనని ప్రశంసించారు.

Also Read:తండ్రి అంత్యక్రియల ఖర్చులపై అన్నదమ్ముల మధ్య గొడవ.. అన్నను కత్తెరతో పొడిచి తమ్ముడు పరార్

విశ్వనాథ్ & సన్స్ లో సూర్య పాత్ర చాలా కష్టమైనదని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు. ఎక్కువ చేయకుండా, అండర్‌ప్లే చేయాల్సిన పాత్రను సూర్య ఎంతో సహజంగా పోషించారని ప్రశంసించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని అన్నారు. ఒకే ఏడాది వ్యవధిలో పూర్తిగా భిన్నమైన కథలతో కరుప్పు, విశ్వనాథ్ & సన్స్ సినిమాలు చేయడం ద్వారా సూర్య తన ప్రయాణాన్ని మరోసారి కొత్తగా ప్రారంభించినట్లు అనిపిస్తోందని త్రివిక్రమ్ చెప్పారు. సూర్య నుంచి నేర్చుకోవాల్సింది ఆయన వినయమని పేర్కొన్నారు.

Also Read:ఫౌజీ నుంచి ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్టర్

ఇక సూర్య, కార్తీని తాము తెలుగు హీరోలుగానే భావిస్తామని త్రివిక్రమ్ అన్నారు. ప్రస్తుతం తమిళ, తెలుగు, హిందీ అనే భేదాలు తగ్గిపోయి అన్ని భాషలు కలసి ఇండియన్ సినిమాగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటాల్సిన సమయం వచ్చిందని, అందుకు అందరూ కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. మొత్తానికి సూర్యపై త్రివిక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సూర్య, మహేష్ బాబు వయసు విషయంలో ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు