Homeతెలంగాణదారి తప్పుతున్న తెలంగాణ రాజకీయం...!

దారి తప్పుతున్న తెలంగాణ రాజకీయం…!

  • ఐఏఎస్ అధికారులపై గులాబీ పార్టీ గురి

  • ఒకప్పటి కెసిఆర్ సన్నిహితుడు జియేష్ రంజన్ పై విమర్శలు

  • కాంగ్రెస్ ప్రభుత్వంలో విశేష కృషి చేస్తుండడమే కారణం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు కూడా సెగ తగులుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబాన్ని భారత రాష్ట్ర సమితి టార్గెట్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉన్నతాధికారుల పేర్లను కూడా ఆ పార్టీ రాజకీయ వివాదాల్లోకి లాగుతోంది. సాధారణంగా కొందరు వివాదాస్పద అధికారులపై ఆరోపణలు వస్తే రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పేరును భారత రాష్ట్ర సమితి ఈ జాబితాలో చేర్చడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ను కుదిపేస్తోంది.

కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు…

Also Read:రూ.271 కోట్ల పెంట్‌హౌస్‌.. దేశ రియల్ ఎస్టేట్‌లో సంచలనం!

జయేష్ రంజన్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు అన్న పేరు ఉంది. గులాబీ పార్టీ హయాంలో ఐటి పరిశ్రమ శాఖల మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు.. జెయే ష్ రంజన్ కీలక పాత్ర పోషించారు. కెటిఆర్ విజన్ ను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో, గ్లోబల్ ఇన్వెస్టర్లను హైదరాబాద్కు ఆకర్షించడంలో కేటీఆర్ తో కలిసి పని చేశారు రంజన్. కేటీఆర్ బృందంలో కీలక సభ్యుడిగా పేరు పొందారు. అటువంటి ఐఏఎస్ అధికారిని ఇప్పుడు భారత రాష్ట్ర సమితి టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.

గులాబీ పార్టీ యూటర్న్…

Also Read:లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు

అయితే ఉన్నట్టుండి రంజన్ పై భారత రాష్ట్ర సమితి శ్రేణులు పడడంపై రకరకాల చర్చ నడుస్తోంది. సివిల్ సర్వీసెస్ అధికారులు రాజ్యాంగానికి, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వానికి మాత్రమే కట్టుబడి పని చేస్తారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఒక అధికారి పాత పాలకుల పట్ల విశ్వాసాన్ని చూపుతూ.. కొత్త ప్రభుత్వంలో పని చేయకుండా ఉండలేరు. ప్రభుత్వ విధానాలను వేగవంతంగా అమలు చేయడం ఐఏఎస్ అధికారి ప్రాథమిక బాధ్యత. కేటీఆర్ హయాంలో ఐటీ రంగానికి ఊపిరి పోసినట్టే.. రేవంత్ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు చూస్తున్నారు రంజన్. దీనిని తట్టుకోలేకపోతున్న గులాబీ పార్టీ రంజన్ ను టార్గెట్ చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు