HomeUncategorizedకుమార్తె హత్య కేసులో దంపతులకు జీవిత ఖైదు

కుమార్తె హత్య కేసులో దంపతులకు జీవిత ఖైదు

క్రైమ్ం మిర్రర్ : కుమార్తె హత్య కేసులో తండ్రి, సవతి తల్లిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది. 2024 జూన్ 10న అర్ధరాత్రి ధనేపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తులసీపూర్ మాధవ్‌గంజ్‌లో నివసించే రాజేష్ శుక్లా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆస్తి వివాదం నేపథ్యంలో తన సోదరులు తనపై, తన కుమార్తె శ్వేతపై కత్తితో దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన శ్వేతను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. శ్వేత తాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 2024 జూన్ 12న రాజేష్, అతని భార్య కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ఏడాది జూలై 11న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. శ్వేతకు ఓ వ్యక్తితో వివాహం చేయాలని రాజేష్ భావించాడు. అయితే ఆ వ్యక్తి వరకట్నం హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో శ్వేత ఆ వివాహాన్ని వ్యతిరేకించింది. ఈ కారణంతో తండ్రి రాజేష్, సవతి తల్లి కిరణ్ కలిసి శ్వేతను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

అయితే ఘటనను పక్కదారి పట్టించేందుకు ఆస్తి వివాదం కారణంగా తన సోదరులు తనపై, కుమార్తెపై దాడి చేశారని రాజేష్ పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. కేసులో ఇరుపక్షాల వాదనలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి దుర్గా నారాయణ్ సింగ్.. రాజేష్, కిరణ్‌లను దోషులుగా నిర్ధారించారు. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధించారు.
also read : బాలిక గర్భవతి అంటూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్ధారణ.. ప్రైవేట్ పరీక్షల్లో ట్విస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు