Homeతెలంగాణహైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు...!

హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్‌: హైదరాబాద్ మెట్రో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లను సమకూర్చాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మెట్రోకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా రైళ్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ (HMRL)పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న రైళ్ల సామర్థ్యం, భవిష్యత్ అవసరాలపై చర్చించారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అదనపు కోచ్‌ల కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఓల్డ్ సిటీ మెట్రో పనులకు వేగం…

Also Read:రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. మృతదేహాన్ని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రైలు పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో ఫేజ్‌-2లో భాగంగా MGBS నుంచి చంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల కారిడార్‌ పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ, భూసేకరణ వంటి అంశాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ (MGBS) నుంచి చంద్రాయణగుట్ట వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, మెట్రో కారిడార్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలపై ఢిల్లీ మెట్రో అధికారుల సలహాలు తీసుకోవాలని కూడా సూచించారు.

Also Read:విద్యుత్ పోల్‌ అమర్చుతుండగా విషాదం.. 5 సెకన్లలోనే కార్మికుడి మృతి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు