Homeసినిమావారణాసిలో శ్రీరాముడిగా మహేశ్ బాబు.. హనుమంతుడిగా ఎవరంటే?

వారణాసిలో శ్రీరాముడిగా మహేశ్ బాబు.. హనుమంతుడిగా ఎవరంటే?

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఎస్‌ఎస్‌ రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ వరల్డ్‌ మూవీ వారణాసి పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రామాయణానికి సంబంధించిన కీలక ఘట్టం సినిమాలో ఉండనుండగా.. ఈ ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు శ్రీరాముడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. అయితే హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపించనున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.వారణాసిలో రామాయణ ఎపిసోడ్‌ను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క ఎపిసోడ్‌ షూటింగ్‌ దాదాపు 60 రోజుల పాటు సాగిందని గతంలో రాజమౌళి వెల్లడించారు. సుమారు 25 నిమిషాల నిడివి ఉండే ఈ ఘట్టంలోని ప్రతి భాగాన్ని ప్రత్యేకమైన సినిమాలా చిత్రీకరించినట్లు తెలిపారు. శ్రీరాముడి పాత్ర కోసం మహేశ్‌బాబు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం.ఇక హనుమంతుడి పాత్ర కోసం గతంలో నటుడు ఆర్‌. మాధవన్‌ పేరు వినిపించింది. అయితే తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేరు తెరపైకి వచ్చింది. పాత్రకు అవసరమైన పవర్‌, ఇంటెన్సిటీ, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కారణంగా చరణ్‌ను ఈ పాత్రకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై వారణాసి టీమ్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తగానే చూడాలి.

అఖిల్ నెక్ట్స్ మూవీపై టీమ్ క్లారిటీ ఇదే!

ఒకవేళ రామ్‌చరణ్‌ నిజంగానే హనుమంతుడిగా కనిపిస్తే మాత్రం సినిమాపై హైప్‌ మరో స్థాయికి చేరే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్‌ తర్వాత రాజమౌళి, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహేశ్‌బాబు శ్రీరాముడిగా, చరణ్‌ హనుమంతుడిగా ఒకే ఎపిసోడ్‌లో కనిపిస్తే అభిమానులకు అది భారీ విజువల్‌ ట్రీట్‌గా మారొచ్చు.ఇదిలా ఉంటే మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వారణాసి పోస్టర్లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రుద్ర పాత్రలో పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్‌ రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్‌లో కనిపించారు. ఈ నేపథ్యంలో హనుమంతుడి పాత్రలో చరణ్‌ నటిస్తున్నారనే వార్త నిజమవుతుందా? అనేది తెలియాలంటే మేకర్స్‌ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

కర్రెగుట్టల్లో తొలిసారి రెప‌రెప‌లాడిన జాతీయ జెండా…! 50 ఏళ్ల త‌రువాత ఆ కంచు కోట ఇక‌పై…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు