Homeసినిమారవితేజ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ గుడ్‌బై.. కొత్త నిర్మాత ఎవరంటే?

రవితేజ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ గుడ్‌బై.. కొత్త నిర్మాత ఎవరంటే?

క్రైమ్ మిర్రర్, సినిమా:- మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస పరాజయాల తర్వాత తన సినిమాల విషయంలో కొత్త విధానాన్ని అనుసరిస్తున్న రవితేజ.. లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇరుముడి సినిమాను పూర్తి చేశారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఇరుముడి కోసం రవితేజ కనీస పారితోషికం తీసుకుని, సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిర్మాణ సంస్థతో రవితేజ మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలు పెట్టాలని గతంలో ప్లాన్ చేశారు.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త నిర్మాణ సంస్థ చేతుల్లోకి వెళ్లినట్లు సమాచారం.

డాక్టర్‌గా రజనీకాంత్.. కొత్త మూవీ ధర్మన్‌పై క్రేజీ అప్డేట్!

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి విడిపోయిన దిల్‌రాజు భాగస్వామి లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వైదొలిగిందనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొత్త నిర్మాత నుంచి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.మరోవైపు రవితేజ దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న మరో సినిమాను కూడా ప్రారంభించనున్నారు. హషిత్ గోలి దర్శకత్వం వహించే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా వరుస ప్రాజెక్టులతో రవితేజ బిజీగా ఉండగా, వివేక్ ఆత్రేయతో చేయనున్న సినిమా నిర్మాత మారడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ తప్పుకున్న విషయం, కొత్త నిర్మాత వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు…! ఈరోజు ఎంతంటే…

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు