Homeసినిమాయశ్ కోసం నయనతార రూల్ బ్రేక్.. ఇన్నాళ్ల సీక్రెట్ బయటపెట్టిన లేడీ సూపర్‌స్టార్!

యశ్ కోసం నయనతార రూల్ బ్రేక్.. ఇన్నాళ్ల సీక్రెట్ బయటపెట్టిన లేడీ సూపర్‌స్టార్!

క్రైమ్ మిర్రర్, సినిమా:-లేడీ సూపర్‌స్టార్ నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అయితే టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఆమె హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌కు ఎందుకు దూరంగా ఉంటారో, యశ్ ఒక్క ఫోన్ కాల్‌కు ఎందుకు స్పందించారో నయనతార వెల్లడించారు.సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడటం తనకు అంతగా రాదని నయనతార తెలిపారు. అందుకే సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకు దూరంగా ఉంటానని చెప్పారు. అయితే టాక్సిక్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా కావడంతో ప్రమోషన్ కార్యక్రమానికి హాజరయ్యానని వెల్లడించారు.టాక్సిక్ ట్రైలర్ లాంచ్‌కు రావడానికి హీరో యశ్ చేసిన ఒక్క ఫోన్ కాల్‌నే కారణమని నయనతార తెలిపారు. యశ్ స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారని, ఆయన ఆహ్వానాన్ని కాదనలేకపోయానని చెప్పారు. తాను ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని, కానీ యశ్‌లా కష్టపడే నటుడిని చూడలేదని ప్రశంసించారు.టాక్సిక్ కోసం యశ్ దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డారని నయనతార తెలిపారు. సినిమా కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా పక్కన పెట్టారని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ప్రతి నటుడు సౌకర్యంగా ఉన్నారా? ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇస్తున్నారా? అనే విషయాలపై యశ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారని చెప్పారు.

ఢిల్లీ ఎయిమ్స్‌లో దారుణం: మహిళా రోగిపై సెక్యూరిటీ గార్డు అనుచిత ప్రవర్తన

దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై కూడా నయనతార ప్రశంసలు కురిపించారు. సెట్స్‌లో ప్రతి నటుడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని, కష్టమైన పరిస్థితుల్లో వారికి అండగా నిలిచారని తెలిపారు. నటీనటుల భావోద్వేగాలను అర్థం చేసుకునే ప్రత్యేకమైన సున్నితత్వం గీతూకు ఉందని అన్నారు.టాక్సిక్‌లో నటించిన రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులపై కూడా నయనతార ప్రశంసలు కురిపించారు. యశ్ భార్య రాధిక పండిట్ తనకు అతిపెద్ద బలమని పేర్కొన్నారు. సినిమా కోసం హీరో ఎంత కష్టపడతాడో అందరూ మాట్లాడతారని, కానీ కుటుంబం చేసే త్యాగాల గురించి పెద్దగా మాట్లాడరని నయనతార అన్నారు.టాక్సిక్ సాధారణ సినిమా కాదని, ట్రైలర్‌లో చూపించింది కొంత మాత్రమేనని నయనతార చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు