క్రైమ్ మిర్రర్ : అస్సాంలోని కచార్ జిల్లాలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులు బాలికలను బలవంతంగా కారులో ఎక్కించుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, మిజోరామ్‌కు చెందిన ఇద్దరు బాలికలను నిందితులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కదులుతున్న వాహనంలోనే తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఆగస్టు 3న తెల్లవారుజామున బాధిత బాలికలు ధోలై పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని వారు ఆరోపించారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రాజ్‌నగర్‌కు చెందిన అమ్జాద్ హుస్సేన్ లస్కర్, భగా బజార్‌కు చెందిన సద్దాం హుస్సేన్ లస్కర్, ఖాస్‌పూర్‌కు చెందిన రింకు దాస్‌గా గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read : రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ డాక్టర్ మృతి
