Homeక్రైమ్రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ డాక్టర్ మృతి

రాజమండ్రిలో ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ డాక్టర్ మృతి

క్రైమ్ మిర్రర్ : రాజమండ్రిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక కన్నుమూశారు. ఈ నెల 3న ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆమె, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాదం తర్వాత ప్రియాంకను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. సుమారు ఐదు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రసాదిత్యమాల్ ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి రాజమండ్రికి చెందిన సూరవరపు దస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : టాటూలతో బయటపడిన నటి హత్య మిస్టరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు