Homeక్రైమ్ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దారుణం.. భార్యను చంపిన భర్త అరెస్ట్

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దారుణం.. భార్యను చంపిన భర్త అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ ఘటనలో అసలు నిజం బయటపడింది. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన కేసు, విచారణలో పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా తేలింది. భార్య పేరిట ఉన్న రూ.44 లక్షల బీమా మొత్తాన్ని పొందేందుకు భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, అమర్ సింగ్ తన భార్య రీటా (32)ను పథకం ప్రకారం ఓ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న తన సహచరులతో కలిసి ఆమెను కారుతో ఢీకొట్టించాడు. అనంతరం ఘటనను ప్రమాదంలా చూపించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

హత్య అనంతరం అమర్ సింగ్ ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో పొలాలకు వెళ్తున్న కొందరు రైతులు రోడ్డుపక్కన ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ లభించిన బ్యాంక్ స్లిప్ ఆధారంగా మృతురాలిని రీటాగా గుర్తించారు. అడిషనల్ ఎస్పీ అరవింద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, నిందితుల విచారణ ద్వారా ఈ ఘటన ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని నిర్ధారించారు. కేవలం 48 గంటల్లోనే కేసు మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు.

విచారణలో రీటా పేరుతో ఉన్న రూ.44 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మొత్తంలో కొంత భాగాన్ని తన అప్పులు తీర్చేందుకు ఉపయోగించుకోవాలని అమర్ సింగ్ భావించగా, మిగిలిన మొత్తాన్ని సహకరించిన వ్యక్తులకు పంచాలని ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో అమర్ సింగ్‌తో పాటు అతనికి సహకరించిన అమిత్ గుప్తా, పుష్పేంద్ర సోని, అభయ్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రీటా, అమర్ సింగ్‌లు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని, రీటాకు ఇది రెండో వివాహం కాగా అమర్ సింగ్‌కు మూడో వివాహమని పోలీసులు తెలిపారు.
also read : రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగత అవమానాలనైనా ఎదుర్కొంటా: సీఎం విజయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు