HomeUncategorizedరూపారెడ్డిపై అట్రాసిటీ, మోసం కేసులు.. 14 రోజుల రిమాండ్

రూపారెడ్డిపై అట్రాసిటీ, మోసం కేసులు.. 14 రోజుల రిమాండ్

క్రైమ్ మిర్రర్ : మణికొండకు చెందిన బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసుతో పాటు మరో మూడు మోసం (చీటింగ్) కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల సమాచారం ప్రకారం, అధిక వడ్డీ ఇస్తానంటూ పలువురు సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు రూపారెడ్డిపై ఉన్నాయి. ఈ వ్యవహారంలో నష్టపోయిన బాధితులు ఇటీవల మణికొండలోని ఆమె నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు.

అనూహ్య మలుపు

బాధితుల నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన కుమార్తె శ్రేయాస్‌కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్‌తో నిశ్చితార్థం జరిగిందని, వారి వివాహాన్ని అంగీకరించాలని రూపారెడ్డి మీడియా సమావేశంలో కోరారు. అదే సమావేశంలో పాల్గొన్న సంతోష్ గౌడ్, తనకు ప్రాణహాని ఉందని, ఈ నేపథ్యంలోనే రూపారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ పరిణామాల అనంతరం పోలీసులు రూపారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా, సంతోష్ గౌడ్ ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, మరికొందరు బాధితులు కూడా రూపారెడ్డిపై ఫిర్యాదులు చేసేందుకు నార్సింగి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : పాఠశాలలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు