Homeక్రీడలుసన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్-2027 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించే యోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జాతీయ జట్టు బాధ్యతలపై ఎక్కువ దృష్టి సారించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో పాటు, వన్డే వరల్డ్ కప్ కూడా ఉండటంతో, తన స్వదేశానికి ప్రాధాన్యం ఇవ్వాలని కమిన్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ మొత్తానికి అతను అందుబాటులో ఉండే అవకాశం తక్కువ.కమిన్స్ గైర్హాజరీలో లేదా పనిభారాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో, ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భారత యువ ఆటగాడి వైపు మొగ్గు చూపుతోంది. దీంతో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి లైన్ క్లియర్ అయినట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి.ఈ సీజన్‌లో కూడా ఇషాన్ కిషన్ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. ఏడు మ్యాచ్‌లలో అతను జట్టుకు కెప్టెన్సీ వహించిన విషయం తెలిసిందే. ఆ అనుభవం అతనికి కలిసి వస్తుందని ఫ్రాంచైజీ భావిస్తోంది. అంతేకాకుండా, దేశవాళీ క్రికెట్‌లో కూడా అతను నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ స్క్వాడ్‌కు ఇషాన్ సారథిగా వ్యవహరిస్తుండటం విశేషం.ఈ పరిణామాలన్నీ గమనిస్తే, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సన్‌రైజర్స్ యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను నాయకుడిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికారిక ప్రకటన వెలువడితే, ఐపీఎల్‌లో మరో యువ కెప్టెన్‌ను చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

ఆలయ పునర్నిర్మాణంపై అర్చకుల స్పష్టత..!

కవితపై బిఆర్ఎస్ సైలెన్స్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు