Homeఆంధ్ర ప్రదేశ్అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త!

-వచ్చేనెల 15లోగా తొలి దశ చెల్లింపులు
-భూములు వేలం వేసి చెల్లించేలా ఏర్పాట్లు
-రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:- అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం. బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. అగ్రిగోల్డ్ భూములను బహిరంగ వేలం వేసి.. తద్వారా వచ్చే నిధులను బాధితులకు పంపిణీ చేసేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల పరిహారానికి సంబంధించి విధివిధానాలను వెల్లడించారు. త్వరలో బాధితులందరికీ డిపాజిట్లు చెల్లించేందుకు రూట్ షెడ్యూల్ ను రూపొందిస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఇది కొంత ఉపశమనం కలిగించే విషయమే.

ఇది పరిస్థితి..
రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థకు 20,450 ఎకరాల స్థిరాస్తులు ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే తొలి విడతలో భాగంగా 6330 ఎకరాలను బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ వేలం ద్వారా సమకూరిన ఆదాయాన్ని బాధితులకు చెల్లించాలని నిర్ణయించింది. వేలానికి సంబంధించిన విధి విధానాలను ఈ నెలలోనే ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 15 నాటికి తొలి విడత డబ్బు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై ఆస్తుల వేలానికి సంబంధించిన విధివిధానాలతో పాటు అంతర్రాష్ట్ర సమస్యలపై చర్చించుకున్నారు. బాధితులకు స్పష్టమైన వివరాలు తెలియజేసే విధంగా వెబ్సైట్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అలా డిపాజిట్లు పక్కదారి..
దేశవ్యాప్తంగా 5.85 లక్షల మంది ఏజెంట్లు అగ్రిగోల్డ్ సంస్థకు ఉండేవారు. సుమారు 32 లక్షల మంది ఖాతాదారులు ఉండేవారు. వారి వద్ద నుంచి రూ.6380 కోట్ల రూపాయలను సేకరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో ఒక్క ఏపీలోనే రూ.3944 కోట్లు ఉన్నాయి. దాదాపు 18, 57,290 మందికి ప్లాట్లు ఇస్తామని ఆశ చూపి..5,76,579 ప్లాట్లను మాత్రమే చూపించి డిపాజిట్లను పక్కదారి పట్టించింది అనేది అగ్రిగోల్డ్ పై ఉన్న అభియోగం. అప్పటినుంచి బాధితులు ఆశగానే ఎదురుచూస్తున్నారు. 2019లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. రాజకీయంగా లబ్ది పొందారు. కానీ ఎటువంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తరువాత క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు అయింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. తొలివిడతగా వచ్చేనెల 15లోగా చెల్లింపులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు