Homeతెలంగాణఆత్మరక్షణలో హరీష్ రావు!

ఆత్మరక్షణలో హరీష్ రావు!

  • మళ్లీ సెంటిమెంట్ అస్త్రం

  • వ్యక్తిగత, భాగస్వామ్య వ్యాపార ఆరోపణలు రావడంతో యూటర్న్

  • నీళ్ల రాజకీయం మొదలుపెట్టిన ట్రబుల్ షూటర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- మాజీ మంత్రి హరీష్ రావు ఆత్మరక్షణలో పడ్డారా? తనపై వచ్చిన ఆరోపణలను ఆయన నివృత్తి చేయలేకపోతున్నారా? వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు సెంటిమెంటు రగిలించేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ముద్ర చూపిన హరీష్ రావు ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అందుకే పాత సెంటిమెంట్ కార్డును తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. తనపై వచ్చిన తీవ్రమైన బ్లాక్ మ్యూజిక్ ఆరోపణలతో పాటు వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన మిల్చీ మిల్క్ విభాగం పై సరిగ్గా స్పందించలేకపోతున్నారు. సమాధానం చెప్పలేక డిఫెన్స్ లో పడిపోతున్నారు. సదరు అంశాలపై స్పందించకుండా.. ఇప్పుడు హఠాత్తుగా ఏపీ ప్రాజెక్టులు, గోదావరి బోర్డు సమావేశాల అంశంపై పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

  • గత ఆరోపణలని తిప్పి..

హరీష్ రావు దాడి మామూలుగా ఉండదు. కానీ ఎందుకో ఆత్మరక్షణలో భాగంగా ఆయన మళ్లీ నీళ్ల రాజకీయాలు మొదలుపెట్టినట్లు అర్థం అవుతోంది. దీనిపై విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే గోదావరి బోర్డు భేటీ పై, ఏపీ ప్రభుత్వం పై చేసిన ఆరోపణలేవీ కొత్తవి కావు. గత పుష్కరకాలంగా రెండు రాష్ట్రాల మధ్య, బోర్డు సమావేశాల్లో ఉత్పన్నమవుతున్న టెక్నికల్ అభ్యంతరాలనే ఆయన మళ్లీ పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ప్రకటనలు చేస్తున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసిందో.. ఇప్పుడు కూడా అటువంటి సాంకేతిక అంశాలు తెరపైకి వచ్చాయి. దానిని రాజకీయంగా వాడుకోవాలని హరీష్ రావు చూస్తున్నారు. కేవలం తనపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు.. ఇలా డైవర్షన్ చేస్తున్నారు అనేది అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన.

  • మళ్లీ సెంటిమెంట్ అస్త్రం..

నీళ్ల రాజకీయాలతో మళ్లీ తెలంగాణలో సెంటిమెంటును రగిలించేందుకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇటీవల హరీష్ రావు పై వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో మిల్చి మిల్క్ కంపెనీలో బిజెపి నేతలతో ఉన్న భాగస్వామ్యం పై వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన వెబ్ సైట్ ని అర్ధాంతరంగా డౌన్ చేశారు. ఎంతవరకు దానిపై ఆయన నోరు విప్పలేదు. మరోవైపు ఇటీవల బ్లాక్ మ్యాజిక్ ఉదంతం పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సైతం ఆయన సమాధానం చెప్పలేదు. నీళ్ల సెంటిమెంట్తో టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ప్రత్యక్ష ఆధారాలతో ఖండించే అలవాటు హరీష్ రావుకు ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మౌనంగా ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

  • డైవర్షన్ పాలిటిక్స్..

హరీష్ రావు డైవర్షన్ పాలిటిక్స్ కు చిరునామా అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత ఆరోపణలు, అక్రమ అప్పుల పంచాయితీలు, ఇతర పార్టీ నేతలతో తెరవ వెనుక ఉన్న వ్యాపార సంబంధాలు బయటపడిన ప్రతిసారి.. తెలంగాణ నీళ్లు, ఆత్మగౌరవం అంటూ ప్రెస్ మీట్ లు పెట్టి టాపిక్ డైవర్షన్ చేయడం భారత రాష్ట్ర సమితి ప్రతినిధులకు అలవాటైన విద్య అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో లేవనెత్తిన ప్రశ్నలకు పక్కా ఆధారాలతో వివరణ ఇవ్వకుండా.. సెంటిమెంట్ ముసుగులో దాగోవాలని ప్రయత్నం చేయడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు