Homeతెలంగాణఒక బిడ్డ 18 ఏళ్ల ఖర్చు 1.89 కోట్లా...? సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌...

ఒక బిడ్డ 18 ఏళ్ల ఖర్చు 1.89 కోట్లా…? సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్రస్తుతం దేశంలో ప్రతీ ఒక్కటి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో యువత పెళ్లిళ్లు అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకున్న వారు పిల్లలను కనాలంటేనే ఖర్చులు లెక్కేస్తున్నారు. ఒక్కరు ముద్దు, అసలే వద్దు అంటూ పిల్లల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్‌లో ఒక బిడ్డను 18 ఏళ్ల వరకు పెంచాలంటే ఎంత ఖర్చు అవుతుందనే అంశంపై కంటెంట్ క్రియేటర్ విఖ్యాత్ సింగ్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి.. పిల్లలు పుట్టి, 18 ఏళ్లు వచ్చే వరకు వారికి అయ్యే ఖర్చులను లెక్కించాడు.ఒక కుటుంబం ఒక్కో బిడ్డకు సుమారు రూ.1.39 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని విఖ్యాత్ సింగ్ అంచనా వేశారు.

Also Read:వైసీపీపై బోరుగడ్డ తిరుగుబాటు!

ద్రవ్యోల్బణం, ఉన్నత విద్య ఖర్చులు, పెట్టుబడులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం కాస్తా.. రూ.2 కోట్లకు పైగా చేరవచ్చని పేర్కొన్నారు. గర్భధారణ, డెలివరీ, మెడికల్ టెస్టులు, మందులు వంటి ఖర్చులకు సుమారు రూ.3 లక్షలు అవసరమవుతాయని విఖ్యాత్ సింగ్ చెప్పారు. పుట్టిన తర్వాత తొలి 2 ఏళ్లలో డైపర్లు, టీకాలు, ఫుడ్, ఇతర అవసరాల కోసం మరో రూ.6 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు.2 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వరకు పిల్లల ఆహారానికి మొత్తంగా రూ.15 లక్షలు ఖర్చు పెట్టాలని విక్రాంత్ సింగ్ తెలిపారు. వారి విద్యకు ప్లే స్కూల్ నుంచి స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు, ట్రిప్స్ కలిపి ఇంకో రూ.33 లక్షలు అవసరమవుతాయని లెక్కించారు. ఇక ట్యూషన్లకు రూ.9 లక్షలు.. ఆరోగ్య సంరక్షణకు రూ.5.4 లక్షలు.. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూ.9 లక్షలు.. బట్టలకు రూ.7.2 లక్షలు.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు రూ.4 లక్షలు.. స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్లకు రూ.8 లక్షలు..

Also Read: తెలంగాణలో జెన్ జీ తుస్!

రవాణాకు రూ.8 లక్షలు.. పిల్లలు పుడితే పెద్ద ఇంట్లో నివసించాల్సిన అవసరం వస్తుందని అందుకు అదనంగా అద్దెకు రూ.32.4 లక్షలు ఖర్చవుతుందని వివరించారు.ఈ క్రమంలోనే విఖ్యాత్ సింగ్ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విఖ్యాత్ సింగ్ చెప్పినట్లు పిల్లల పెంపకం ప్రస్తుతం ఆర్థికంగా ఎంతో భారంగా మారిందని కొందరు నెటిజన్లు అంగీకరిస్తూ పోస్టులు పెడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్నీ డబ్బుతోనే ముడిపెట్టకూడదని హితవు పలుకుతున్నారు. పిల్లలు ఇచ్చే ఆనందం, ప్రేమ, కుటుంబానికి వచ్చే సంతోషాన్ని ఎంత డబ్బుతో అయినా కొలవలేమని పేర్కొంటున్నారు. పిల్లల వల్ల కలిగే ఆనందానికి ఎలాంటి విలువ కట్టలేమని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు