హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హాలీవుడ్‌లో స్టార్‌గా రాణిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మరువలేదని మరోసారి నిరూపించారు నటి ప్రియాంక చోప్రా. అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడిన ఆమె, తన కుమార్తె మాలతీ మేరీకి చిన్నప్పటి నుంచే భారతీయ ఆధ్యాత్మిక విలువలను పరిచయం చేస్తున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక షేర్ చేసిన వీడియోలో ఆమె తన కుమార్తె మాలతీతో కలిసి దుర్గాదేవికి సంబంధించిన మంగళ శ్లోకాన్ని పఠిస్తూ కనిపించారు. సర్వ మంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధికే… శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే పవిత్ర శ్లోకాన్ని చిన్నారికి నేర్పిస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ నాలో రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి.. ఒకటి అమ్మ, మరొకటి సరదా వ్యక్తి అంటూ సరదా క్యాప్షన్ కూడా జోడించారు.
Also Read:అరెస్ట్‌పై మండిపడ్డ ఎంకే స్టాలిన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
వీడియోలో మొదట కూతురితో కలిసి భక్తి భావంతో శ్లోకం చదివిన ప్రియాంక, ఆ తర్వాత స్నేహితులతో కలిసి వెస్ట్రన్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఒకవైపు భారతీయ సంప్రదాయాలను పాటిస్తూనే, మరోవైపు తన సరదా వ్యక్తిత్వాన్ని కూడా చూపించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మాలతీకి చిన్న వయసులోనే సంస్కృత శ్లోకాలు నేర్పించడం చాలా మందిని ఆకట్టుకుంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం వారణాసిలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక మందాకినీ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ కోసం భర్త నిక్ జోనాస్, కుమార్తె మాలతీతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె కొంతకాలం ఇక్కడే గడిపారు.
Also Read:సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి
షూటింగ్ విరామ సమయంలో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సినిమా కూడా వీక్షించిన ప్రియాంక, భారతీయ అభిమానులతో కూడా మమేకమయ్యారు. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ప్రపంచ స్థాయి స్టార్ అయినా భారతీయ సంస్కృతిని మరవలేదు, మాలతీకి మంచి విలువలు నేర్పిస్తున్నారు అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
