Hometelanganaగండ్ర వర్సెస్ సిరికొండ!

గండ్ర వర్సెస్ సిరికొండ!

-భూపాలపల్లి టికెట్ కోసం అప్పుడే లొల్లి
-వచ్చే ఎన్నికల్లో పోటీకి వెంకటరమణ రెడ్డి సన్నాహాలు
-రేసులో ఉన్నానంటున్న మధుసూదనాచారి కుమారుడు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. అయినా ఇప్పుడు ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆశావహులు సిద్ధం అవుతుండడంతో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది. ప్రధానంగా భూపాలపల్లి నియోజకవర్గంలో.. గులాబీ పార్టీలో చిచ్చు రేగింది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి వర్సెస్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. రెండు వర్గాలు టికెట్ల కోసం పట్టుబడుతుండడంతో ఇప్పుడే లొల్లి మొదలైంది.

గండ్ర పార్టీ మారడంతో..
మొన్నటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలోకి దిగారు గండ్ర వెంకట రమణారెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అనూహ్యంగా బిఆర్ఎస్ లో చేరారు. అప్పటికే ఆ పార్టీలో మధుసూదనాచారి క్రియాశీలకంగా ఉన్నారు. 2014 నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మాత్రం ఇదే గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మధుసూదనాచారికి 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. గండ్రకు సహకరించాలని మధుసూదనాచారికి కెసిఆర్ ఆదేశించారు. అయితే ఆయన మనస్ఫూర్తిగా పనిచేయకపోవడంతో గండ్ర వెంకట రమణారెడ్డి ఓడిపోయారు అనేది ఒక వాదన. ఇప్పుడు అదే భూపాలపల్లి సీటును మధుసూదనాచారి కుమారుడు ఆశిస్తుండడంతో వివాదం రేగింది. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు.. తనకే పార్టీ టికెట్ అన్నట్టు మధుసూదనాచారి కుమారుడు ప్రకటించారు. దీనిపై గండ్ర వెంకట రమణారెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టున్న నేతలు..
గండ్ర వెంకట రమణారెడ్డి నియోజకవర్గంలో పట్టున్న నేత. కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలోనే ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనాచారి పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో మాత్రం అదే మధుసూదనాచారి చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మాత్రం అదే మధుసూదనాచారి పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి అతి తక్కువ మంది గెలవగా అందులో గండ్ర వెంకట రమణారెడ్డి ఒకరు. కానీ కొద్ది రోజులకే భారత రాష్ట్ర సమితిలోకి ఫిరాయించారు. అప్పటినుంచి మధుసూదనాచారి తో విభేదాలు తలెత్తాయి. ఒకే పార్టీలో ఉన్న మీరు ఒక్కరినొకరు విభేదించుకుంటూ వచ్చారు. 2023లో గండ్ర వెంకట రమణారెడ్డి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటినుంచి ఈ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తుండడంతో విభేదాలు ముదురుతున్నాయి. మరి పార్టీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే సీనియారిటీ పరంగా మధుసూదనా చారి ముందుంటారు. ఆయన 1994- 99లో టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు. కెసిఆర్ పిలుపుతో తెలంగాణ ఉద్యమంలో చేరారు. 2014లో మాత్రమే ఆయన టిఆర్ఎస్ తరఫున గెలిచారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు