Homeఆంధ్ర ప్రదేశ్ఒంగోలు పై కూటమి గురి!

ఒంగోలు పై కూటమి గురి!

-మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహం
-మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అభ్యర్థిత్వంపై మొగ్గు
-గెలుపు బాధ్యతలు మాజీ మంత్రి బాలినేనికి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
ప్రకాశం జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి అండగా నిలుస్తూ వస్తోంది ఆ జిల్లా. అయితే ఆ జిల్లాలో వైసిపి పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. దానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకూడదు అని భావిస్తోంది కూటమి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. పేరు మోసిన నేతలంతా వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు నగరపాలక సంస్థను కైవసం చేసుకోవాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒంగోలు మేయర్ పీఠం సాధించి ప్రకాశం జిల్లాలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. దీనిని గమనించిన కూటమి మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ముందుగా మున్సిపల్ ఎన్నికలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఒంగోలు కార్పొరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది. ప్రధానంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుటుంబాన్ని టిడిపిలోకి తెచ్చి.. మేయర్ పీఠం అప్పగించాలని చూస్తోంది. ఆయన అయితే ఆర్థిక బలంతో పాటు అంగ బలం ఉందని గుర్తించింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో ఉన్న సిద్ధ రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. టిడిపిలో చేరేందుకు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని టిడిపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

బాలినేనికి ప్రత్యేక బాధ్యతలు..
అయితే ఒంగోలు మేయర్ పీఠంపై దృష్టి పెట్టారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం ఆయన జనసేన లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కుమారుడిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. అయితే అక్కడ టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ అవకాశం లేకుండా పోయింది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గ నుంచి తన కుమారుడిని కూటమి తరుపున రంగంలోకి దించే అవకాశం ఉంది. అయితే ఒంగోలు కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాస్క్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావును టిడిపి మేయర్ అభ్యర్థిగా పెట్టి గెలిపించుకునే బాధ్యతను బాలినేని తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఒంగోలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు భారీ మాస్టర్ ప్లాన్ తో ఉంది కూటమి. మరి ఆ ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

స్టాలిన్ కు పన్నీరు సెల్వం షాక్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు