Homeజాతీయంచెన్నై మెట్రోలో సీఎం విజయ్ ప్రయాణం.. మురిసిపోయిన ప్రయాణికులు, వీడియోలు వైరల్!

చెన్నై మెట్రోలో సీఎం విజయ్ ప్రయాణం.. మురిసిపోయిన ప్రయాణికులు, వీడియోలు వైరల్!

క్రైమ్ మిర్రర్,పాలిటిక్స్ :- తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేపట్టిన మెట్రో రివ్యూ రైడ్ అభిమానులకు, సాధారణ ప్రయాణికులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. చెన్నైలోని ఓమందూర్ స్టేషన్‌లో స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన ఆయన, అక్కడి నుంచి నందనం వైపు మెట్రో రైలులో ప్రయాణించారు.రైలులో విజయ్‌ని ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రయాణ సమయంలో ఆయన పలువురితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు, అభిమానులతో కలిసి సరదాగా ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు విజయ్ చేతిని ముద్దుపెట్టుకుని తన అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై పోలీసుల ఆంక్షలు!

డబ్బుల కోసం గొర్ల కాపరి హత్య.. మైనర్ అరెస్ట్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు