Homeతెలంగాణఎన్యూమరేషన్ కు మరో వారం మాత్రమే ఛాన్స్! గడువులోగా పూర్తి చేయకపోతే ఓటర్ లిస్టులో పేరుండదు

ఎన్యూమరేషన్ కు మరో వారం మాత్రమే ఛాన్స్! గడువులోగా పూర్తి చేయకపోతే ఓటర్ లిస్టులో పేరుండదు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియకు సమయం దగ్గరపడుతోంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో వారం రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.ఆన్‌లైన్‌లో లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆగస్టు 3వ తేదీని ఆఖరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫామ్ ల పంపిణీ 100 శాతం పూర్తయింది.ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 75.13 శాతం ఫామ్‌లు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని ఎన్నికల సంఘం (EC) వెల్లడించింది. ఇంకా 25 శాతానికి పైగా ఫారాలు డిజిటలైజ్ కావాల్సి ఉంది.

గడువులోగా పూర్తి చేయకపోతే ప్రమాదం

ఈసీ స్పష్టం చేసిన దాని ప్రకారం, నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయని ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఓటర్లందరూ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, వెంటనే తమ ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్ ద్వారా కానీ, సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్‌ను సంప్రదించి కానీ సమర్పించాలి.ఓటు హక్కును కాపాడుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం కావడంతో, ప్రజలందరూ వెంటనే స్పందించాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.

పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో కాక రేపుతున్న ధ‌నుష్ కామెంట్స్‌…!

దేశంలోని టాప్ 10 రిచెస్ట్ సీఎంల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు