క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందు క్రికెట్ వర్గాల్లో ఒక సంచలన వార్త తీవ్రస్థాయిలో చక్కర్లు కొడుతోంది. ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. ఈ మెగా ట్రేడ్ కోసం ముంబై ఫ్రాంచైజీకి సీఎస్కే యాజమాన్యం ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!
రూ. 20 కోట్ల భారీ డీల్!
ట్రేడ్ విండోలో భాగంగా హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే డీల్ ముందుపెట్టినట్లు తెలుస్తోంది. హార్దిక్ కు బదులుగా తమ జట్టులోని స్టార్ పవర్ హిట్టర్ శివమ్ దూబే, యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌లను ముంబైకి ఇచ్చేందుకు చెన్నై సిద్ధమైంది. కేవలం ఆటగాళ్లనే కాకుండా, వారితో పాటు అదనంగా రూ. 10 కోట్ల నగదును కూడా ముంబైకి చెల్లించేందుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే ఈ ట్రేడ్ డీల్ విలువ దాదాపు రూ. 20 కోట్ల వరకు ఉంటుందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆయుష్ మ్హత్రే కోసం ముంబై పట్టు.. తిరస్కరించిన సీఎస్కే
అయితే, ఈ భారీ డీల్ పై ఇరు ఫ్రాంచైజీల మధ్య ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. హార్దిక్ ను ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ ట్రేడ్ లో భాగంగా చెన్నై నుంచి యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రేను కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం. కానీ, భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఆయుష్‌ను వదులుకునేందుకు సీఎస్కే యాజమాన్యం ససేమిరా అంటోంది. ముంబై చేసిన ఆ ప్రతిపాదనను చెన్నై సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ మెగా ట్రేడ్ డీల్‌కు సంబంధించి ఇరు జట్ల యాజమాన్యాల మధ్య ఇంకా అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. ఒకవేళ ఈ ట్రేడ్ గనుక సాకారమైతే ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత సంచలన మార్పుల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ముంబై పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఏకంగా చిరకాల ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరతాడన్న వార్తలు అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఏపీకి వాయుగుండం ముప్పు..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు – APSDMA హెచ్చరిక
