Homeఆంధ్ర ప్రదేశ్ఏపీకి వాయుగుండం ముప్పు..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు - APSDMA హెచ్చరిక

ఏపీకి వాయుగుండం ముప్పు..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు – APSDMA హెచ్చరిక

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.దీని ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండనుంది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రెండు మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాపాయం పొంచి ఉన్నందున తీర ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. రాష్ట్ర యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

స్నానానికి చల్లటి నీళ్లా? వేడి నీళ్లా? ఏది బెస్ట్! – వైద్యుల సలహా ఇదే

తక్కువ ధరకే బంగారం అంటూ మోసం – కడపలో నకిలీ గోల్డ్ ముఠా బట్టబయలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు