Homeతెలంగాణబాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి బాలకృష్ణను స్వయంగా పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు నేరుగా బాలకృష్ణ ఉన్న గదికి వెళ్లి ఆయనను కలిశారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి, ఆయనకు అందుతున్న చికిత్స వివరాల గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, బాలకృష్ణతో కాసేపు ముచ్చటించి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

ఈ పరామర్శకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో బాలకృష్ణ వాకర్ సాయంతో నిలబడి ఉండటం గమనించవచ్చు.కాకినాడ పోర్టులో ప్రమాదంకొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టులో జరుగుతున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో బాలకృష్ణ పాల్లొంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో జరిగిన ఊహించని పరిణామంతో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

కోలుకోవాలని హోమం చేస్తున్న గోపీచంద్ మలినేని..!
మరోవైపు, బాలకృష్ణ అత్యంత వేగంగా కోలుకుని తిరిగి యథావిధిగా తన కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని.. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కాంక్షిస్తూ బెంగళూరులోని ఒక ప్రముఖ ఆలయంలో ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారన్న వార్తతో ఆయన అభిమానులు తొలుత ఆందోళనకు గురైనప్పటికీ, సీఎం చంద్రబాబు పరామర్శ, వైద్యుల ప్రకటనతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటుడు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు