Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో డేంజర్ బెల్స్...!

ఏపీలో డేంజర్ బెల్స్…!

  • పెరుగుతున్న కరోనా కేసులు

  • కొత్త వేరియంట్ తో విరుచుకుపడుతున్న మహమ్మారి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19 కి చేరాయి. వైయస్సార్ కడప జిల్లాలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా నమోదైన కేసులన్నీ కొత్త వేరియంట్ అని తెలుస్తోంది.

అయితే అంత ఆందోళన అవసరం లేదని.. అప్రవత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 25 రోజుల్లో కరోనా సోకిన బాధితుల్లో నలుగురు మృతి చెందారు. కానీ వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

అయితే తాజా ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలో గుర్తించిన 19 కేసుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపించింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో నమూనాలను పరీక్షిస్తే.. ఆర్ ఎఫ్ 5 వేరియంట్గా నిర్ధారించారు. అయితే ఈ కొత్త వేరియంట్ తో అంత పెద్ద ప్రమాదం లేదని.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

  • ఆందోళన చెందాల్సిన పనిలే..

అయితే ఈ ఆర్ ఎఫ్ 5 వేరియంట్ కు సంబంధించి.. కోవిడ్ రెండు వైరస్ కాలక్రమంలో ఒమిక్రాన్ గా రూపాంతరం చెందింది. దీని మరో రూపం జేఎన్ 1 నుంచి ఎల్ ఎఫ్ 7,1.1.1 బ్రాంచులు ఏర్పడ్డాయి. వీటి రెండింటి కలయిక ఆర్ ఎఫ్ 5 అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ప్రధానంగా ఈ వేరియంట్ సోకిన వారు దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడతారు. జ్వరం బారిన పడతారు. వెంటనే టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

  • వైద్యుల కీలక సూచనలు..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు రద్దీప్రదేశాల్లో మాస్కులు ధరిస్తూ.. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, శ్వాస సంబంధిత సమస్యలు, గుండె, కిడ్నీ రోగులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

కరోనా లక్షణాలు ఉన్నవారు తొలుత హోం ఐసోలేషన్ లో ఉండాలని.. రోజుల తరబడి తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యులను ఆశ్రయించాలని చెబుతున్నారు. కడపలో తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరులో సైతం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరి తో పాటు బాపట్ల ప్రాంతంలో కూడా కేసులు నమోదవుతుండడం విశేషం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు