-
నోటిఫికేషన్లు గులాబీ పార్టీ హయాంలో.. నియామక పత్రాలు హస్తం చేతిలో…
-
మైలేజ్ కోసం రెండు పార్టీల ఆరాటం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల క్రెడిట్ వార్ నడుస్తోంది. అధికార కాంగ్రెస్ వర్సెస్ విపక్ష బీఆర్ఎస్ అన్నట్టు పరిస్థితి మారింది. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఏకంగా 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటూ ఉందని ప్రచారం చేస్తోంది. కానీ బీఆర్ఎస్ దీనిని అంగీకరించడం లేదు. ఆ ప్రచారాన్ని ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న నియామక పత్రాలన్నీ గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి.. పరీక్షలు నిర్వహించిన వేనని చెబుతోంది. అదంతా తమ కష్టమని.. క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంటోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.
గులాబీ పార్టీకి అదే మైనస్…
Also Read:మైనర్ బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు నమోదు
తెలంగాణలో ఎవరి హయాంలో ఉద్యోగాలు భర్తీ అన్నది చర్చకు వస్తే గులాబీ పార్టీకి ఒక మైనస్ కనిపిస్తోంది. పదేళ్లపాటు సుదీర్ఘంగా అధికారంలో ఉంది ఆ పార్టీ. ఎన్నికలకు ముందు అత్యంత కీలకమైన నియామక ప్రక్రియలను పూర్తి చేయలేకపోవడం ఆ పార్టీ చేసిన అతి పెద్ద పొరపాటు. కోర్టు కేసులు, సాంకేతిక ఇబ్బందులు ఉన్న మాట నిజమే. సుదీర్ఘ కాలం పాటు నోటిఫికేషన్. ఒకవేళ ఆ నియామకాలను తమ హయాంలో పూర్తి చేసి ఉంటే.. మొన్నటి ఎన్నికల్లో యువత పాజిటివ్గా స్పందించి ఉండేవారు. ఉద్యోగాల భర్తీ ఆలస్యం చేయడం వల్ల తెలంగాణలో గులాబీ పార్టీ తీవ్రంగా నష్టపోయింది.
దశాబ్ద కాలం ఎదురుచూపు…
Also Read:కూర నచ్చలేదని పోలీసులకు ఫోన్ చేసిన భర్త.. బదాయూంలో విచిత్ర ఘటన
అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియామక పత్రాలు అందుకున్నారు నిరుద్యోగ అభ్యర్థులు. తెలంగాణలో దశాబ్ద కాలం పాటు ఉద్యోగాల కోసం ఎదురుచూసినవారు కాంగ్రెస్ హయాంలోనే నియామక పత్రాలను అందుకోవడం విశేషం. గ్రూప్ 4, గురుకుల, పోలీస్ రిక్రూట్మెంట్లతో పాటు దాదాపు 11,000 పోస్టులతో కూడిన డీఎస్సీ ఫలితాలను సైతం కాంగ్రెస్ సర్కారు వేగంగా విడుదల చేసింది. నియామక పత్రాలను పంపిణీ చేసింది. ఆ పార్టీకి దక్కిన పెద్ద ప్లస్ పాయింట్ అదే. రాజకీయాల్లో టైమింగ్ అనేది ముఖ్యం. తాము అధికారంలో ఉన్నప్పుడు పనులు పూర్తి చేయకుండా.. పాము పెట్టిన నోటిఫికేషన్ వల్లే ఉద్యోగాలు వచ్చాయని భారత రాష్ట్ర సమితి చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యువతకు ఇది మింగుడు పడడం లేదు. భారత రాష్ట్ర సమితి నిర్లక్ష్యమే హైలెట్ అవుతోంది. అందుకే యువ సంగ్రామ సభ పేరుతో బీఆర్ఎస్ హడావిడి చేస్తోంది.