హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రావే చెలియా సాంగ్ ని లాంచ్ చేశారు.
Also Read:జిమ్ ట్రైనర్‌పై తీవ్ర ఆరోపణలు.. మత్తుమందు ఇచ్చి దాడి చేశాడని యువతి ఫిర్యాదు
జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాట ప్రేమ, భావోద్వేగాలతో హార్ట్ టచ్చింగ్ మెలోడీగా కంపోజ్ చేశారు. నాగ్ అర్జున్ రెడ్డి అందించిన మనసుని తాకే సాహిత్యానికి, కపిల్ కపిలన్ తన వోకల్స్ తో ప్రాణం పోశారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా పలికించింది. ఈ పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ, దూరమైనప్పుడు కలిగిన ఎమోషన్స్ ప్రేక్షకులను హత్తుకున్నాయి. విజువల్స్ కూడా పాట ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేశాయి. అజయ్ భూపతి తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ పాటల్లో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ తమ ఆకట్టుకునే నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది.
Also Read:కూర నచ్చలేదని పోలీసులకు ఫోన్ చేసిన భర్త.. బదాయూంలో విచిత్ర ఘటన
జయకృష్ణ ISC సినిమాటోగ్రఫీని నిర్వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మాధవ్ కుమార్ గుళ్ళపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. : జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు తదితరులు నటించారు.