క్రైమ్ మిర్రర్, సినిమా:- కాజల్ అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్‌తో మగధీర, చిరంజీవితో ఖైదీ నెం.150 వంటి భారీ విజయాల్లో నటించిన కాజల్.. తాజాగా తనకు ఉత్తర భారతదేశంలో పాపులారిటీని తీసుకొచ్చిన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్‌కు నార్త్‌లో మీకు ఎక్కువ గుర్తింపు తెచ్చిన దక్షిణాది సినిమా ఏది అని ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఎలాంటి సందేహం లేకుండా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య 2 చిత్రాన్ని పేర్కొన్నారు.ఆర్య 2లో అల్లు అర్జున్ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య సాగే ప్రేమకథ, పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదల సమయంలో సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, తర్వాత టెలివిజన్ ప్రసారాలు, హిందీ డబ్బింగ్ ద్వారా ఉత్తర భారత ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. అదే తనకు నార్త్‌లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని కాజల్ వెల్లడించారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం.. సూసైడ్ నోట్‌తో మలుపు.!
కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఆమె కెరీర్‌లో అతిపెద్ద విజయాల్లో ఒకటైన మగధీరను కాకుండా ఆర్య 2 పేరును చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మగధీర అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించింది. అలాగే చిరంజీవితో నటించిన ఖైదీ నెం.150 కూడా భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఇదిలా ఉండగా, పెళ్లి తర్వాత కాజల్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తనకు నచ్చిన కథలు, కుటుంబ సభ్యులు కూడా చూడగలిగే పాత్రలనే ఎంచుకుంటున్నట్లు ఇటీవలే వెల్లడించారు. గతంలో కన్నప్ప, సత్యభామ చిత్రాల్లో కనిపించిన ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఎన్బీకే111 చిత్రంలో నటిస్తున్నారు.తెలుగుతో పాటు హిందీలో కూడా కాజల్ బిజీగా ఉన్నారు. ది ఇండియా స్టోరీ, రామాయణ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తూ మరోసారి తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్తున్నారు.
తెలంగాణలో వర్షాల జోరు.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక