Homeసినిమాలెనిన్ సక్సెస్ మీట్‌లో అఖిల్‌పై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్..!

లెనిన్ సక్సెస్ మీట్‌లో అఖిల్‌పై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఇటీవల విడుదలైన లెనిన్ సినిమాతో అఖిల్ అక్కినేని కెరీర్‌లో తొలి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమా విజయోత్సాహంలో భాగంగా నిర్వహించిన లెనిన్ బ్లాక్‌బస్టర్ వైభవం కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తమ్ముడు కొంచెం ఆలస్యంగా వచ్చినా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారని అన్నారు. ఇటీవల ప్రతి ఈవెంట్‌లో అభిమానుల ఉత్సాహం, స్పందన పూర్తిగా మారిపోయిందని, అది ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కథను అఖిల్ అంగీకరించిన క్షణమే అతను నిజమైన హీరోగా మారాడని ప్రశంసించారు.

తాను తొలిసారి లెనిన్ కథ విన్నప్పుడు కొంత భయపడ్డానని నాగచైతన్య వెల్లడించారు. ఇలాంటి పాత్రను సాధారణంగా అనుభవం ఉన్న నటులు చేస్తారని భావించానని, కానీ అఖిల్ ఆ పాత్రను పూర్తిగా తనదిగా మార్చుకుని ఎంతో కష్టపడి నటించాడని కొనియాడారు. ఒక అన్నయ్యగా, ప్రేక్షకుడిగా, అభిమానిగా అఖిల్‌పై తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.నాగార్జున గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్నలో ఉండే పట్టుదల, కష్టపడే తత్వం తమ ఇద్దరికే బాగా తెలుసని అన్నారు. మనం, బంగార్రాజు చిత్రాల తర్వాత లెనిన్ కోసం కూడా అదే అంకితభావంతో పనిచేస్తున్న నాగార్జునను చూశానని చెప్పారు. ఈ కథ విన్నప్పుడు ఒకసారి ఆలోచించమని తాను సూచించినా, ఈ సినిమాను తప్పకుండా విజయవంతం చేస్తాననే నమ్మకంతో నాగార్జున ముందుకు వెళ్లారని గుర్తుచేశారు.

దర్శకుడి గురించి కూడా నాగచైతన్య ప్రశంసలు కురిపించారు. సవ్యసాచి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్, హీరో-విలన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు.చివరగా అఖిల్‌ను ఉద్దేశించి మాట్లాడిన నాగచైతన్య ఎమోషనల్ అయ్యారు. నా బేబీ సిసింద్రీకి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అఖిల్ ఎన్ని సినిమాలు చేసినా, తనకు మాత్రం ఎప్పటికీ చిన్న సిసింద్రీగానే ఉంటాడని చెప్పడంతో సభలో చప్పట్లతో హర్షధ్వానాలు వినిపించాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు